IND vs AUS: అతడి వికెటే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌.. లేదంటేనా?

23 Mar, 2023 13:46 IST|Sakshi

టీమిండియా స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత తొలి సిరీస్‌ పరాభావాన్ని చవిచూసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. 1-2 తేడాతో సిరీస్‌ను కొల్పోయింది. మార్చి 2019 తర్వాత స్వదేశంలో టీమిండియాకు ఇదే తొలి సిరీస్‌ ఓటమి. ఇక ఆఖరి వన్డే ఓటమిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు.

కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడమే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. కాగా 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌..248 పరుగులుకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న కేఎల్‌ రాహుల్‌ 32 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని రాహుల్‌ నెలకొల్పాడు.

"ఈ రన్‌ ఛేజింగ్‌లో టీమిండియా ఎక్కువ భాగం మ్యాచ్‌ను తన కంట్రోల్‌లోనే ఉంచుకుంది. కానీ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కోల్పోవడం మ్యాచ్‌ ఒక్క సారిగా ఆసీస్‌ వైపు మలుపు తిరిగింది. అదే సమయంలో అక్షర్‌ పటేల్‌ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్‌ కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విరాట్‌పై కాస్త ఒత్తిడి పెరిగింది.

                                                      

అందుకే అతడు కాస్త దూకుడుగా ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. చెన్నై లాంటి పిచ్‌పై ఒక్క వికెట్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలదు. అయితే మ్యాచ్‌ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాలి. అది భారత ఇన్నింగ్స్‌లో కనిపించలేదు. మొదటి నుంచే భారీ షాట్‌లు ఆడటానికి ప్రయత్నించారు.

అది రాహుల్‌ను చూస్తే అర్దమవుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే ముందు భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించాడు. అతడు బలవంతంగా షాట్లు ఆడినట్లు తెలుస్తుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: మ్యాచ్‌ ఓడిపోయినా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

మరిన్ని వార్తలు