ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ రద్దు 

28 Aug, 2020 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సవరించిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వార్షిక క్యాలెండర్‌లో భారత్‌లో జరగాల్సిన ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీ, సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌–300 టోర్నీలకు స్థానం లేకుండా పోయింది. ఈ ఏడాదికి ఈ రెండు టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పాత షెడ్యూల్‌ ప్రకారం ఇండియా ఓపెన్‌ మార్చిలో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ టోర్నీని డిసెంబర్‌కు వాయిదా వేశారు. సయ్యద్‌ మోదీ ఓపెన్‌ను నవంబర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజాగా సవరించిన క్యాలెండర్‌లో ఈ రెండు టోర్నీలను తొలగించారు. అయితే అక్టోబర్‌ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరగాల్సిన థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ ప్రపంచ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను యధావిధిగా నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు