IND vs AUS: పుజారా అరుదైన రికార్డు.. ఘనంగా సత్కరించిన బీసీసీఐ! వీడియో వైరల్‌

17 Feb, 2023 11:24 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ చ‌తేశ్వర్ పూజారా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలోకి పుజారా చేరాడు. ఈ అరుదైన ఘనత సాధించిన 13వ భారత క్రికెటర్‌గా ఈ "నయావాల్‌" రికార్డులకెక్కాడు.

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా మైదానంలో అడుగు పెట్టిన పూజారా ఈ ఘనతను సాధించాడు. ఈ సందర్భంగా పూజారాను బీసీసీఐ  ఘ‌నంగా స‌త్కరించింది. భారత దిగ్గజం సునీల్ గ‌వాస్కర్‌ చేతుల మీదగా పూజారా ప్రత్యేక క్యాప్‌ను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో పూజారా కుటంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన పూజారా 
అదే విధంగా వందో టెస్టు ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టిన పూజారా.. సహాచర ఆటగాళ్ల నుంచి  'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించాడు. తొలి రోజు ఆట సందర్భంగా పూజారా ఫీల్డింగ్‌ వస్తుండగా.. టీమిండియా ఆటగాళ్లు  వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. 

ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక​ భారత్‌ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు.
చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా?!

మరిన్ని వార్తలు