శ్రమించి నెగ్గిన సింధు 

25 Oct, 2023 02:13 IST|Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.  మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్‌ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్‌ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్‌ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్‌ తొలి  రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–13, 21–13తో లుకాస్‌ కోర్వి–రొనన్‌ లాబర్‌ (ఫ్రాన్స్‌) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.   

మరిన్ని వార్తలు