ఐపీఎల్‌-2024 వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే?

3 Nov, 2023 19:01 IST|Sakshi
ఐపీఎల్‌ ట్రోఫీ

ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్‌ 19న దుబాబ్‌ వేదికగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం జరగనుంది. అదే విధంగా ఈవెంట్‌లో భాగమయ్యే  మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 నాటికి ఐపీఎల్ కమిటీకి సమర్పించాలి. కాగా ఐపీఎల్‌ వేలం భారత్‌లో కాకుండా బయట దేశంలో జరగడం ఇదే తొలి సారి.

రూ. 5 కోట్లు పెరగనున్న పర్స్ విలువ..
కాగా ఈ సారి వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ పర్స్‌ విలువను 5 కోట్లు పెంచాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూ రూ. 95 కోట్లగా ఉంది. ఇప్పడు రూ. 5 కోట్లు పెరిగితే ఒక్కో ఫ్రాంచైజీ  100 కోట్ల మొత్తాన్ని కలిగి ఉంటుంది. 

ప్రస్తుతం ఏ ఫ్రాంచైజీ పర్స్‌లో ఎంత ఉందో ఓ లూక్కేద్దం. పంజాబ్ కింగ్స్ ఖాతాలో అత్యధిక మొత్తం ఉంది. ఆ ఫ్రాంచైజీ వద్ద రూ.12.20 కోట్లు ఉన్నాయి. అదే విధంగా ముంబై ఇండియన్స్ అందకరికంటే తక్కువ పర్స్ విలువను కలిగి ఉంది. వారి ఖాతాలో రూ.5 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

పంజాబ్‌ కింగ్స్‌- రూ. 12.20 కోట్లు

ముంబై ఇండియన్స్‌- రూ. 0.05 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రూ. 6.55 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌- రూ.4.45 కోట్లు

లక్నో సూపర్‌ జెయింట్స్‌- రూ.3.55 కోట్లు

రాజస్తాన్‌ రాయల్స్‌- రూ.3.55 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- రూ.1.75 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌- రూ. 1.65 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌- రూ. 1. 5 కోట్లు
 

మరిన్ని వార్తలు