IND vs SA: ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు.. రెండో భారత ఆటగాడిగా..!

10 Oct, 2022 08:41 IST|Sakshi

రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించింది. భారత విజయంలో శ్రేయస్‌ అయ్యర్‌(113 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌(93) కీలక పాత్ర పోషించారు. కాగా కిషన్‌ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. సెంచరీకి ఏడు పరుగుల దూరంలో కిషన్‌ పెవిలియన్‌కు చేరాడు.

ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కిషన్‌.. మిడిల్‌ ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడు చేసిన 93 పరుగులలో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయంటే.. అతడు ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కిషన్‌ వన్డేల్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఇన్నింగ్స్‌లో అ‍త్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా కిషన్‌ రికార్డులకెక్కాడు.

కిషన్‌ 24 ఏళ్ల 83 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఉన్నాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో పంత్‌ 7 సిక్స్‌లు బాది ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పంత్‌ 23 ఏళ్ల 173 రోజుల వయస్సులో ఈ రికార్డును సాధించాడు.


చదవండి: IND vs SA: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన షాబాజ్ అహ్మద్

మరిన్ని వార్తలు