టీటీ మూడో రౌండ్లో మనిక

26 Jul, 2021 06:05 IST|Sakshi

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా మూడో రౌండ్‌కు చేరగా.. పురుషుల ఈవెంట్‌ నుంచి సత్యన్‌ నిష్క్రమించాడు. రెండో రౌండ్‌లో 62వ ర్యాంకర్‌ మనిక 4–11, 4–11, 11–7, 12–10, 8–11, 11–5, 11–7తో  32వ ర్యాంకర్‌ పెసొస్కా (ఉక్రెయిన్‌) పై గెలిచింది. తన వ్యక్తిగత కోచ్‌కు మైదానంలో అందుబాటులో ఉండే అక్రిడేషన్‌ కార్డు ఇవ్వకపోవడంతో మనిక కోచ్‌ లేకుండానే ఆడుతోంది. జట్టు హెడ్‌ కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ నుంచి ఆమె సలహాలు తీసుకోవడానికి నిరాకరించింది.  పురుషుల రెండో రౌండ్లో సత్యన్‌ 7–11, 11–7, 11–4, 11–5, 9–11, 10–12, 6–11తో సియు హంగ్‌ లమ్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు.

మరిన్ని వార్తలు