Ashes Series: జో రూట్‌ స్థానంలో కెప్టెన్‌గా అతడే కరెక్ట్‌: మాజీ సారథి

31 Dec, 2021 15:48 IST|Sakshi

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఘోర పరాభవంతో ఈ ఏడాదిని ముగించింది ఇంగ్లండ్‌ జట్టు. బాక్సింగ్‌ డే టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 14 పరుగుల తేడాతో ఓటమి పాలై ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో జో రూట్‌ కెప్టెన్సీ, జట్టు ఎంపిక తీరుపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. 

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ సారథి మైఖేల్‌ ఆథర్టన్‌ రూట్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జట్టు పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు... ‘‘సెలక్షన్‌ నుంచి... స్ట్రాటజీ వరకు ప్రతి విషయంలోనూ తప్పిదాలే... వీటన్నింటికీ కెప్టెన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా రూట్‌ మంచి విజయాలు అందించాడు. గొప్ప సారథి అనిపించుకున్నాడు.

కానీ.. ఆస్ట్రేలియాలో రెండు ఘోర పరాభవాలు... యాషెస్‌లో వైఫల్యం... రూట్‌ స్థానంలో మరొకరు ఆగమనం చేయాల్సిన అవసరం ఉంది. బెన్‌స్టోక్స్‌ అతడికి ప్రత్యామ్నాయం’’ అని టైమ్స్‌కు రాసిన ఆర్టికల్‌లో తన అభిప్రాయాలు వెల్లడించాడు. అదే విధంగా కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ కూడా ఏమాత్రం ఆకట్టులేకపోయాడని పెదవి విరిచాడు. కాగా స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ను రెండో టెస్టు నుంచి తప్పించడం... జాక్‌ లీచ్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడం వంటి నిర్ణయాలతో అతడు విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

మరిన్ని వార్తలు