CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..!

1 Oct, 2023 18:43 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్‌ 1996-2007 మధ్యలో 39 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో మెక్‌గ్రాత్‌ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి.

ఈ జాబితాలో స్పిన్‌ లెజెండ్‌, శ్రీలంక మాజీ బౌలర్‌ ముత్తయ్య మురళీథరన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ 1996-2011 మధ్యలో 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 నాలుగు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో మురళీ అత్యుత్తమ గణాంకాలు 4/19గా ఉన్నాయి. 

మూడో స్థానం విషయానికొస్తే.. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ ఈ స్థానాన్ని అక్యూపై చేశాడు. మలింగ 2007-2019 మధ్యలో 29 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో మలింగ అత్యుత్తమ గణాంకాలు 6/38గా ఉన్నాయి. 

మలింగ తర్వాత వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్‌ పేస్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ నిలిచాడు. అక్రమ్‌ 1987-2003 మధ్యలో 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో అక్రమ్‌ అత్యుత్తమ గణాంకాలు 5/28గా ఉన్నాయి.

ఈ జాబితాలో భారత బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఏడో స్థానంలో నిలిచాడు. జహీర్‌ 2003-2011 మధ్యలో 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ నాలుగు వికెట్ల ఘనత ఉంది. ప్రపంచకప్‌లో జహీర్‌ అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి.

ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్న బౌలర్లలో ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (18 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు) ఐదో స్థానంలో.. కివీస్‌ స్పీడ్‌గన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (19 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) 10వ ప్లేస్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈనెల 5వ తేదీ నుంచి వరల్డ్‌కప్‌ స్టార్ట్‌ కానున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు