#MS Dhoni: కోకిలాబెన్‌ హాస్పిటల్‌కు వెళ్లనున్న ధోని.. ఎందుకంటే?

31 May, 2023 13:37 IST|Sakshi

ఐపీఎల్‌-2023 విజేతగా చెన్నైసూపర్‌ కింగ్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించిన సీఎస్‌కే.. ఐదోసారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో తన మోకాలి గాయానికి సంబంధించి పలు టెస్టులు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం తన మెకాలికి సర్జరీ చేసుకునున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ధోని ఈ ఏడాది సీజన్‌ ఆరంభం నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో నడవడానికి కూడా ధోని ఇబ్బంది పడ్డాడు. చెపాక్‌లో జరిగిన సీఎస్‌కే ఆఖరి హోం లీగ్‌ మ్యాచ్‌ అనంతరం ధోని.. స్టేడియం మొత్తం తిరిగుతూ అభిమానులకు అభివాదం చేశాడు.

ఈ క్రమంలో దోని తన మెకాలికి ఓ క్యాప్‌(నీ క్యాప్‌) పెట్టుకుని తిరిగడం కన్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.అ‍యినప్పటికీ ఓ వైపు నొప్పిని భరిస్తునే. . ఒక్క మ్యాచ్‌కు కూడా దూరం కాకుండా తన జట్టును ఛాంపియన్స్‌గా మిస్టర్‌ కూల్‌ నిలిపాడు.  ఇక వచ్చే ఏడాది సీజన్‌లో కూడా ధోని మళ్లీ కన్పించే అవకాశం ఉంది.

ఎందుకంటే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఐపీఎల్‌ నుంచి ధోని తప్పుకుంటాడని అంతా భావించారు. కానీ వచ్చే ఏడాది సీజన్‌కు మరో 9 నెలల సమయం ఉంది కాబట్టి.. త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ధోని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. అయితే ఆడేందుకు తన శరీరం సహకరిస్తే కచ్చితంగా కొనసాగుతానని ధోని పేర్కొన్నాడు.
చదవండి: #MS Dhoni On Retirement: నా కళ్లు చెమర్చాయి.. రిటైర్మెంట్‌ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! ధోని భావోద్వేగం

మరిన్ని వార్తలు