కాంస్యం ఖాయం చేసుకున్న జరీన్

19 Mar, 2021 17:19 IST|Sakshi

టర్కీ: ఇస్తాంబుల్‌ వేదికగా జరుగుతున్న బాస్ఫోరస్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్‌, హైదరాబాద్‌ అమ్మాయి కాంస్య పంతకం ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో జరీన్‌.. కజకిస్థాన్‌కు చెందిన నాజీమ్‌ కైజేబ్‌ను మట్టికరిపించింది.  జరీన్‌ 4-1 తేడాతో కైజేబ్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. దాంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది.  2014, 2016 వరల్డ్‌చాంపియన్‌ షిప్‌లో రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కైజేబ్‌ను ఓడించడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. జరీన్‌ తర్వాత గౌరవ్‌ సోలంకీ 57 కేజీల విభాగంలో ప్యూజిలిస్ట్‌ ఐకోల్‌ మిజాన్‌ను గెలిచి సెమీఫైనల్‌ చేరుకున్నాడు. దాంతో సోలంకీ కూడా కాంస్యాన్ని ఖాయం చేసుకున్నాడు.

అయితే, సోనియా లూథర్‌ (57కేజీలు), పర్విన్‌ (60కేజీల), జ్యోతి(60కేజీల) విభాగాలలో క్వార్టర్లోనే వెనుదిరిగారు. అయితే శివథాప(63 కేజీలు) టర్కీకి చెందిన హకన్‌డొగన్‌ చేతిలో ఓడిపోయాడు. అయితే జరీన్‌ తన తుది పోరులో టర్కీకి చెందిన రజత పతక విజేత బుసేనాజ్‌ కాకిరోగ్లూ ఎదుర్కొవాల్సి ఉంది. ఇక సోలంకీ అర్జెంటినాకు చెందిన నిర్కో క్యూలోతో  తలపడతాడు. 

చదవండి:రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా?

మరిన్ని వార్తలు