NZ vs BAN: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌.. బంగ్లాదేశ్‌ చిత్తు..

11 Jan, 2022 11:42 IST|Sakshi

కింగస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌, 117పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్‌ సమం చేసింది. ఫాలో ఆన్‌ ఆడిన బంగ్లాదేశ్‌  278 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి టెస్టులో ఓటమికి బదులుగా న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చకుంది. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో లిటన్‌ దాస్‌ (102), మోమినుల్ హక్(37) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్‌ జామీసన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, నీల్ వాగ్నర్ మూడు వికెట్లు సాధించాడు.

కాగా న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 521 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగగా, కాన్వే(109), యంగ్‌(54) పరుగులతో రాణించారు. ఇక కివీస్‌ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కూప్పకూలింది. ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా టామ్‌ లాథమ్‌ ఎంపిక కాగా, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు కాన్వేకి దక్కింది. కాగా కేరిర్‌లో అఖరి టెస్టు ఆడుతున్న రాస్‌ టేలర్‌కి  ఘన విజయంతో న్యూజిలాండ్‌ విడ్కోలు పలికింది.

చదవండి: Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్‌.. టాస్‌ గెలిస్తే..

మరిన్ని వార్తలు