పాక్‌ స్వాతంత్య్ర దినోత్సవం.. ట్రోల్‌ అవుతున్న కమ్రాన్‌

14 Aug, 2021 13:35 IST|Sakshi

ఎన్ని పండుగలున్నా.. జెండా పండుగను కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకుంటుంది. ఆగష్టు 15న భారత దేశం.. జిన్నా ఒత్తిడితో అధికార బదలాయింపు ఒకరోజు ముందు జరగడం, మరికొన్ని కారణాలతో 14వ తేదీనే పాకిస్తాన్‌లు స్వాతంత్య్ర సంబురాలు జరుపుతాయని తెలిసిందే. కాబట్టి, ఇవాళ పాక్‌ ఇండిపెండెన్స్‌ డే. ఈ సందర్భంగా క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ చేసిన ఓ ట్వీట్‌.. ట్రోలింగ్‌కు దారి తీసింది.

శనివారం పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్‌Independence డేకి బదులు.. ఇండిపెన్స్‌Indepence అంటూ ఇంగ్లీష్‌లో తప్పు ఫొటో పోస్ట్‌ చేశాడు కమ్రాన్‌.  మూములుగానే పాక్‌ క్రికెటర్లను ఎప్పుడు.. ఎక్కడ దొరుకుతారా? అని ఎదురు చూస్తున్న మన నెటిజన్స్‌.. ఈ తప్పును గుర్తించారు.

ఇంకేం సోషల్‌ మీడియాలో కమ్రాన్‌ అ‍క్మల్‌ను ఇలా ట్రోల్‌ చేసేస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు. కానీ, ఇలా గుర్తించే పెద్ద తప్పు.. అదీ దేశం మీద వేయడంతో పాక్‌లోనూ కొందరు కమ్రాన్‌ విమర్శి‍స్తుండడం విశేషం.

మరిన్ని వార్తలు