అథ్లెటిక్స్‌ కమిషన్‌ ఎన్నికల బరిలో సింధు

24 Nov, 2021 05:27 IST|Sakshi

భారత స్టార్‌ షట్లర్, రెండు ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెటిక్స్‌ కమిషన్‌ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికలు డిసెంబర్‌ 17న జరుగుతాయి. సింధు 2017నుంచి అథ్లెటిక్స్‌ కమిషన్‌లో కొనసాగుతుండగా... రెండో సారి ఆమె మాత్రమే పోటీ పడుతోంది. ఇందులో అందుబాటులో ఉన్న ఆరు మహిళల స్థానాల కోసం తొమ్మిది మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు.

మరిన్ని వార్తలు