అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను!

19 Sep, 2021 05:37 IST|Sakshi

భారత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్య

లండన్‌: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం వచ్చే టి20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగించేందుకు అతను ఆసక్తి చూపించడం లేదు. కోచ్‌గా ఎంతో సాధించానని, గడువు పూర్తయిన తర్వాత ఆగిపోయే మనస్తత్వం తనది కాదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటికే కోచ్‌గా నేను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను.

టెస్టుల్లో ఐదేళ్లు నంబర్‌వన్‌గా ఉండటం, ఆ్రస్టేలియాలో రెండుసార్లు సిరీస్‌ సాధించడం, కరోనా సమయంలో ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టులు గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవడంలాంటివి అద్భుతం. నా నాలుగు దశాబ్దాల క్రికెట్‌లో ఇది ఎంతో సంతృప్తికర క్షణం. వీటికి తోడు టి20 ప్రపంచకప్‌ కూడా గెలిస్తే అది అదనపు ఆనందాన్నిస్తుంది. గెలవగల సత్తా మా టీమ్‌కు ఉంది కూడా. మనకు ఇచ్చిన సమయంకంటే అదనంగా ఒక్క క్షణం కూడా ఆగవద్దని నేను నమ్ముతాను. అందుకే సరైన సమయంలోనే తప్పుకుంటున్నాను’ అని రవిశాస్త్రి వివరించాడు.

మరిన్ని వార్తలు