'నేను కావాలని చేయలేదు.. క్షమించండి'

3 Feb, 2021 18:20 IST|Sakshi

దుబాయ్‌: అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా టీమ్‌ అబుదాబి ఆటగాడు రోహన్‌ ముస్తఫా ఫీల్డింగ్‌ సమయంలో షర్ట్‌ లేకుండా బౌండరీవైపు పరిగెత్తడం తెలిసిందే. సోమవారం రాత్రి నార్తన్‌ వారియర్స్‌, టీమ్‌ అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్తఫా చర్యపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. తాజాగా రోహన్‌ ముస్తఫా ఘటనపై స్పందిస్తూ.. అది కావాలని చేయలేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

'ముందుగా నేను చేసిన తప్పుకు జట్టు సహచరులతో పాటు అబుదాబి టీ10 లీగ్‌ చూసినవాళ్లందరికి క్షమాపణలు కోరుకుంటున్నా. అయితే ఆ పని కావాలని చేసింది మాత్రం కాదు.. ఆ తర్వాతి ఓవర్‌ నేను వేయాల్సి ఉండడంతో జెర్సీని మాత్రమే తీయాలనుకున్నా. కానీ పొరపాటుగా జెర్సీతో పాటు నా షర్ట్‌ కూడా బయటికి వచ్చేసింది. ఇదంతా గమనించని మా బౌలర్‌ అప్పటికే బంతి వేయడం.. నావైపు దూసుకురావడం జరిగిపోయింది. బంతి వేగంగా రావడంతో జెర్సీ వేసుకునే సమయం లేకపోవడంతో అలాగే పరిగెత్తాల్సి వచ్చింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత నేను చేసిన పనికి జట్టుతో పాటు మేనేజ్‌మెంట్‌కు కూడా క్షమాపణ చెప్పానంటూ' తెలిపాడు. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్‌ షాట్‌

ఈ మ్యాచ్‌లో డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ 6 వికెట్ల తేడాతో టీమ్‌ అబుదాబిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ అబుదాబి 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.లూక్‌ రైట్‌ 25 పరుగులు, జో క్లార్క్‌ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తన్‌ వారియర్స్‌ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కామెరాన్‌ డెల్‌పోర్ట్‌ 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కీరన్‌ పొలార్డ్‌ 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.చదవండి: షర్ట్‌ లేకుండా పరిగెత్తాడు.. చివరికి

మరిన్ని వార్తలు