IPL 2022 Mega Auction: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?

27 Jan, 2022 15:40 IST|Sakshi

ఐపీఎల్‌-2022 మెగా వేలానికి స‌మ‌యం అస‌న్న‌మైంది. బెంగ‌ళూరు వేదిక‌గా  ఫిబ్రవరి 12, 13 తేదిల్లో మెగా వేలం జ‌ర‌గ‌నుంది. కాగా ఇప్పటికే 1214 మంది ఆట‌గాళ్లు మెగా వేలం కోసం త‌మ పేర్లును రిజిస్ట‌ర్ చేశారు. కాగా భార‌త మాజీ పేస‌ర్ శ్రీశాంత్ మ‌రో సారి వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సారి త‌న బేస్ ప్రైస్ రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. గ‌త ఏడాది వేలంలో రూ. 75 లక్షలుగా త‌న క‌నీస ధ‌ర‌గా శ్రీశాంత్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అత‌డిని కొనుగొలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఐపీఎల్‌లో శ్రీశాంత్ చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.

ఆ త‌ర్వాత అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని త‌గ్గించ‌మ‌ని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అత‌డిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అత‌డిపై నిషేధం ఎత్తివేయ‌బ‌డింది. కాగా గ‌త ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున ఆడాడు.  అంతే కాకుండా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న కేర‌ళ రంజీ జ‌ట్టులో కూడా శ్రీశాంత్ భాగ‌మై ఉన్నాడు.

చ‌ద‌వండి: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండ‌ర్ గుడ్‌బై..

మరిన్ని వార్తలు