SA Vs IND: 'సఫారీ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ సాధించడానికి ఇదే సువర్ణావకాశం'

19 Dec, 2021 13:16 IST|Sakshi

టీమిండియా దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు భారత్‌ ఆడనుంది. కాగా ఇంతవరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా భారత్‌ గెలవలేదు. దక్షిణాఫ్రికాలో 7 టెస్ట్ సిరీస్‌లు ఆడిన భారత్‌ 6 సిరీస్‌లో ఓటమిచెందింది. ఒక్క సిరీస్‌ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో తొలిసారిగా టెస్ట్‌ సిరీస్‌ గెలచి చరిత్ర సృష్టించాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది.

సెంచూరియన్‌ వేదికగా డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా-భారత్‌ తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సబాకరీం ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ తొలి టెస్ట్‌ సిరీస్‌ను కచ్చితంగా కైవసం చేసుకుంటుందని  సబాకరీం జోస్యం చెప్పాడు. ఇటీవలి కాలంలో ప్రోటీస్ జట్టు పెద్దగా రాణించకపోవడం, భారత్‌కు కలిసొస్తోంది అని అతడు అభిప్రాయపడ్డాడు.

"రానున్న టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 2-0 కానీ, 2-1 తేడాతో తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. ఇక వన్డేల్లో భారత జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పన అవసరంలేదు. ప్రస్తుత జట్టు అత్యుత్తమైనది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం అద్బుతంగా రాణిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో ప్రోటీస్ జట్టు పెద్దగా రాణించకపోవడంతో, విజయం సాధించడానికి భారత్‌కు ఇదే సువర్ణ అవకాశం" అని కరీం పేర్కొన్నాడు.

చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు