మెరిసిన లిటన్, షకీబ్‌

17 Jul, 2021 04:07 IST|Sakshi

హరారే: లిటన్‌ దాస్‌ స్ఫూర్తిదాయక సెంచరీ (114 బంతుల్లో 102; 8 ఫోర్లు)కి  బౌలింగ్‌లో షకీబుల్‌ హసన్‌ (5/30) ప్రదర్శన తోడవ్వడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 28.5 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. చకాబ్వ (54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. 200వ మ్యాచ్‌ ఆడుతోన్న జింబాబ్వే కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌ (24; 3 ఫోర్లు) వికెట్‌ తీయడం ద్వారా బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్‌ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా (269 వికెట్లు) పేరిట ఉండేది. షకీబ్‌ ఇప్ప టి వరకు 213 వన్డేల్లో 274 వికెట్లు తీశాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు