-

Shubman Gill: న్యూజిలాండ్‌పై అదరగొట్టాడు.. ప్రతిష్టాత్మక అవార్డు పట్టేశాడు

13 Feb, 2023 18:23 IST|Sakshi

వైట్‌బాల్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు వరించింది. జనవరి నెలకు గాను గిల్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. గత నెలలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లలో గిల్‌ దుమ్మురేపాడు. న్యూజిలాండ్‌తో హైదరబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దుమ్మురేపిన గిల్‌.. అనంతరం టీ20 సిరీస్‌లోను అద్భుతమైన సెంచరీ సాధించాడు.

అదే విధంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ గిల్‌ ఓ సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా జనవరి నెలలో శుబ్‌మన్‌ 567 పరుగులు చేశాడు. కాగా ఈ ప్రతిష్టాత్మకమైన  అవార్డు కోసం గిల్‌.. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, కివీస్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ ప్యానల్‌ అతడివైపే మొగ్గుచూపింది.

మరోవైపు జనవరి నెలకు గాను మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు  ఇంగ్లండ్ యంగ్‌ క్రికెటర్‌ గ్రేస్ స్క్రీవెన్స్ కు లభించింది. ఈ ఏడాది జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆమె అద్భుతంగా రాణించింది. ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా గా స్క్రీవెన్స్ చరిత్ర సృష్టించింది.
చదవండిWPL Auction: పాకిస్తాన్‌పై దుమ్మురేపింది.. వేలంలో ఊహించని ధర! ఎంతంటే?

మరిన్ని వార్తలు