రైనాకు సాయం చేసిన సోనూసూద్‌

6 May, 2021 21:10 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కరోనా విపత్కర పరిస్థితుల్లో తనకు తోచిన సాయం చేస్తూ రియల్‌ హీరోగా అనిపించుకున్నాడు.కొవిడ్‌ బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనాకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. రైనా తన బంధువు ఒకరు ఆక్సిజన్‌ కొరతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రైనా తన ట్విటర్‌లో పంచుకున్నాడు.

‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలి. ఆమె వయసు 65ఏండ్లు. ఆమె తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. రైనా ట్వీట్​కు వెంటనే స్పందించిన సోనూ సూద్‌ మొదట 'రైనా బాయ్‌.. వివరాలు పంపండి అని ట్వీట్‌ చేశాడు. రైనా వివరాలు పంపిన తర్వాత కాసేపటికే..'' 10 నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌ అంటూ రిప్లై ఇచ్చాడు.

కాగా ఈ మధ్యనే కరోనా పాజిటివ్‌గా తేలిన సోనూసూద్‌ అంత కష్టంలోనూ తన సాయం మాత్రం విడువలేదు. ఇక కరోనా నుంచి కోలుకున్న సోనూ కష్టాల్లో ఉన్నవారికి తన సాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం బరిలోకి దిగాడు. సీఎస్‌కే తరపున ఆడుతున్న రైనా.. 7 మ్యాచ్‌లాడి ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 123 పరుగులు సాధించాడు. ఇక రైనా గతేడాది ఆగస్టు 15న ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కాసేపటికే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాట్లు ప్రకటించాడు.
చదవండి: అందరూ సేఫ్‌గా వెళ్లాకే నేను ఇంటికి పోతా!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు