28 నుంచి లంక ప్రీమియర్‌ లీగ్‌ 

29 Jul, 2020 03:44 IST|Sakshi

కొలంబో: క్రికెట్‌ అభిమానులను అలరించడానికి మరో టి20 లీగ్‌ ముస్తాబయింది. శ్రీలంక వేదికగా లంక ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌ ఆగస్టు 28న మొదలవుతుందని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్న ఈ ఆరంభ లీగ్‌... సెప్టెంబర్‌ 20 వరకు జరుగుతుంది. మొత్తం నాలుగు వేదికల్లో 23 మ్యాచ్‌లు జరుగుతాయని ఎస్‌ఎల్‌సీ తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ లీగ్‌లో శ్రీలంక క్రికెటర్లతోపాటు 70 మందికి పైగా విదేశీ క్రికెటర్లు పాల్గొనే అవకాశముంది. 

మరిన్ని వార్తలు