T20 WC 2021 NZ Vs NAM: కివీస్‌ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. 

5 Nov, 2021 20:43 IST|Sakshi

Ish Sodhi Gets Hit On Face Against Namibia In T20 WC 2021: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌ సందర్భంగా న్యూజిలాండ్ బౌలర్‌ ఐష్‌ సోధి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. నమీబియా ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో డేవిడ్‌ వీస్‌ కొట్టిన బంతి బౌలర్‌ ఐష్‌ సోధి వేళ్లను తాకుతూ నుదుటిపై బలంగా తాకింది. దీంతో సోధి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారంత ఉలిక్కిపడ్డాడు. అయితే, ఆశ్చర్యకరంగా సోధి ఎటువంటి గాయం లేకుండా లేచి నిలబడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మూకుమ్మడిగా రాణించడంతో 52 పరుగుల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది.  
చదవండి: ముజీబ్‌ కోసం ఫిజియోను పంపిస్తామన్న అశ్విన్‌.. తెలుగులో బదులిచ్చిన రషీద్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు