Multibagger Stock: అదృష్టం అంటే వీళ్లదే..! లక్షపెట్టుబడితో రూ.18లక్షలు లాభం

5 Nov, 2021 20:26 IST|Sakshi

దేశీయ స్కాక్‌ మార్కెట్‌లో పెన్నీ స్టాక్స్‌ తారా జువ్వలా దూసుకెళ్తున్నాయి. నవంబర్‌ 2, 2020న రూ.4.18 పైసలున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ బ్రైట్‌.కామ్‌ గ్రూప్‌ స్టాక్స్‌ ఏడాది తిరిగే సరికల్లా ఆ స్కాక్స్‌ వ్యాల్యూ రూ.75.40కి చేరింది. దీంతో ఈ పెన్నీ స్టాక్స్‌ కొన్న ఇన్వెస్టర్లకు పంట పడినట్లైంది. 
 
లక్ష పెడితే రూ.18.03లక్షలు 
ఉదాహరణకు బ్రైట్‌.కామ్‌ గ్రూప్ షేర్లలో ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెడితే  ఈరోజు ఆ లక్షకాస్త రూ.18.03 లక్షలైంది. ఈ మధ్యకాలంలో సెన్సెక్స్ 47.89 శాతం పెరగడంతో ఆ స్కాక్స్‌ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 13న షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరి రూ.90.55ను తాకింది. నిన్న(నవంబర్ 4న) దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌లో షేరు 0.87% లాభంతో రూ.75.40 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ మొత్తం 2.78 లక్షల షేర్లు ఉండగా రూ. 2.10 కోట్ల టర్నోవర్‌ను సాధించడంతో బ్రైట్‌ కామ్‌   కంపెనీ మార్కెట్ క్యాపిటల్‌ వ్యాల్యూ రూ.7,853.91 కోట్లకు చేరింది. 
 
సంవత్సరంలోనే ఇంత లాభమా  
బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 1,002 శాతం లాభపడ్డాయి. కేవలం ఒక్కనెలలో 17 శాతం పెరిగాయి. బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల వ్యాల్యూ స్థిరంగా సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.కాగా బ్రైట్‌.కామ్‌ గ్రూప్ వరల్డ్‌ వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, ఏజెన్సీలు, ఆన్‌లైన్ ప్రచురణకర్తలకు డిజిటల్ మార్కెటింగ్ పరిష్కారాల్ని అందిస్తుంది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ సర్వీసులు పెరగడంతో ఆ షేర్‌ వ్యాల్యూ భారీగా పెరిగినట్లు ఇన్వెస్టర్లు తెలిపారు. 

పెన్నీ స‍్టాక్స్‌ అంటే 
దేశీయ స్కాక్‌ మార్కెట్‌లో రిజిస్టరైన కంపెనీ షేర్‌ వ్యాల్యూ రూ.10 కన్నా తక్కువగా ఉంటే ఆ స్కాక్స్‌ను పెన్నీ స్కాక్స్‌ అంటారు.

మరిన్ని వార్తలు