వైరల్‌: సెరెనా విలియమ్స్‌ విచిత్ర వేషదారణ

11 Feb, 2021 12:08 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భాగంగా అమెరికా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ వేషదారణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కొత్త కాస్ట్యూమ్‌తో తళుక్కుమంది. వన్‌ లెగ్‌ క్యాట్‌సూట్‌ను ధరించి ఆడిన సెరెనా.. అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ స్మారకార్థం దీనిని ధరించినట్లు తెలిపింది.

ఫ్లోజోగా పేరున్న ఫ్లోరెన్స్‌ 1988లో మహిళల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. కాగా కొత్త కాస్ట్యూమ్‌తో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పదో ర్యాంకర్‌ సెరెనా 6–1, 6–1తో లౌరా సిగెమండ్‌ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. సెరెనాతో పాటు జకోవిచ్, నయామి ఒసాకా, రఫెల్‌ నాదల్‌, డొమినిక్‌ థీమ్ రెండో రౌండ్ కు చేరారు.

ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌

మరిన్ని వార్తలు