SA vs IND: రాహుల్‌కి వార్నింగ్‌ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?

4 Jan, 2022 08:47 IST|Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్‌ రాహుల్‌ అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన రాహుల్‌.. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. కాగా భారత రెగ్యులర్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా దూరం కావడంతో ఈ టెస్టుకు రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే తొలి సెషన్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న రాహుల్‌ని ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్మస్ హెచ్చరించాడు. తొలి ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో మూడో బంతిని దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ బౌలింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. చివరి క్షణంలో రాహుల్ వికెట్లు నుంచి దూరంగా తప్పుకున్నాడు.

బంతిని ఎదుర్కోవడానికి రాహుల్‌ సిద్ధంగా లేకపోడంతో చివరి క్షణంలో బౌలర్‌ను ఆపివేసాడు. వెంటనే రాహుల్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ.. కోంచెం త్వరగా ఆడమని అంపైర్ హెచ్చరించాడు. ఈ సంభాషణ అంతా స్టంప్‌ మైక్‌లో రికార్డైంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. . తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్‌ (46) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్‌  4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోయి 35 పరుగులు చేసింది.

చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్‌.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం!

మరిన్ని వార్తలు