ఇది నాకు చాలా స్పెషల్‌ మూమెంట్‌.. మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు: కోహ్లి

4 Mar, 2022 13:25 IST|Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. దీంతో టెస్ట్‌ క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇక మొహాలీ వేదికగా జరగుతున్న టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లిను బీసీసీఐ సత్కరించింది.  ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లిను సత్కరించాడు. ద్రవిడ్‌ 100వ టెస్ట్ క్యాప్‌ను కోహ్లికు అందజేశాడు. ఇక బీసీసీఐ  సెక్రటరీ జే షా స్టాండ్‌లో కూర్చోని ఈ సెలెబ్రేషన్స్‌ను వీక్షించారు. ఇక  సెలెబ్రేషన్స్‌లో కోహ్లి భార్య అనుష్క శర్మ మెరిసింది. కోహ్లి పక్కనే ఉంటూ అతడిని అభినందించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లి.. "నా చిన్ననాటి హీరో ద్రవిడ్ నుంచి  100వ టెస్ట్ జ్ఞాపికగా క్యాప్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. నా భార్య ఇక్కడ ఉంది, నా సోదరుడు కూడా ఉన్నాడు.

ముఖ్యంగా జట్టు మద్దతు లేకపోయి ఉంటే నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడేవాడని కాదు. ప్రస్తుతం మూడు ఫార్మాటాల్లో ఆడుతున్నాము. కానీ టెస్ట్‌ క్రికెట్‌లో ఎక్కువకాలం ఆడడం ఎంతో మనకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. నేను మరింత కాలం జట్టుకు సేవలు అందిస్తాను. యువ క్రికెటర్‌లు టెస్టు ఫార్మాట్‌లో నేను 100 మ్యాచులు ఆడాననే విషయాన్ని తీసుకోవాలి" అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక  విరాట్ కోహ్లీ వందో మ్యాచ్‌ను చూసేందుకు ఆయన తల్లి సరోజ్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ, కూతురు వామిక కోహ్లీలతో పాటు సోదరుడు వికాస్ కోహ్లీ, తదితరులు హాజరయ్యారు. ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IND vs SL 1st Test: 'బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు రోహిత్‌.. అదేంటి అలా ఔటయ్యావ్‌'

మరిన్ని వార్తలు