ICC ODI Rankings: కోహ్లి, రోహిత్‌ల ర్యాంకులు పదిలం.. దూసుకొచ్చిన డికాక్‌, డస్సెన్‌

26 Jan, 2022 19:07 IST|Sakshi

Kohli Retains 2nd Spot In ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి(2వ ర్యాంక్‌), రోహిత్‌ శర్మ(3)లు తమ ర్యాంకులను పదిలంగా కాపాడుకున్నారు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో కోహ్లి రెండు హాఫ్‌ సెంచరీలు బాది రేటింగ్‌ పాయింట్లను మెరుగుపర్చుకోగా, రోహిత్‌.. ఈ సిరీస్‌ ఆడనప్పటికీ తన ర్యాంక్‌కు కాపాడుకోగలిగాడు.


మరోవైపు ఇదే సిరీస్‌లో సెంచరీలతో రాణించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డికాక్‌(5), వాన్‌డర్‌ డస్సెన్‌(10)లు టాప్‌-10లోకి దూసుకురాగా.. పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో రాణించిన సఫారీ కెప్టెన్‌ టెంబా బవుమా(3 వన్డేల్లో 153 పరుగులు).. ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 59వ స్పాట్‌కు చేరుకోగా, బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రొటీస్‌ బౌలర్ ఎంగిడి నాలుగు ప్లేస్‌లు మెరుగుపర్చుకుని 20 స్థానానికి చేరుకున్నాడు.  
చదవండి: Rohit Sharma: హిట్‌ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌.. స్లిమ్‌గా, ఫిట్‌గా..!

>
మరిన్ని వార్తలు