బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్‌కు నోటీసులు 

5 Dec, 2023 08:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బాకీ పడిన రూ. 158 కోట్లకు సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ‘బైజూస్‌’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఈ నోటీసులు ఇచ్చింది. ‘దీనిపై స్పందించేందుకు బైజూస్‌కు రెండు వారాల గడువు ఇచ్చాం.

ఆపై మరో వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలి’ అని ఆదేశించిన ఎన్‌సీఎల్‌టీ... ఈ కేసును డిసెంబర్‌ 22కు వాయిదా వేసింది. 2019లో భారత క్రికెట్‌ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వచ్చిన బైజూస్‌ సంస్థ తర్వాతి రోజుల్లో దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది.    

>
మరిన్ని వార్తలు