Virat Kohli: మరోసారి గోల్డెన్‌ డక్‌ అవ్వకూడదని సీరియస్‌గా ప్రాక్టీస్‌

8 Aug, 2021 11:36 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అండర్సన్‌ బౌలింగ్‌లో కోహ్లి బంతిని అంచనా వేయడంలో పొరబడి కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కోహ్లిని విమర్శిస్తూ భారత అభిమానులు కామెంట్స్‌ చేశారు. మరోసారి ఇది రిపీట్‌ కాకూడదని భావించాడేమో. అందుకే కోహ్లి నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత గ్రౌండ్‌లోకి వచ్చి సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి. కాగా కోహ్లి టెస్టుల్లో ఇప్పటివరకు ఐదుసార్లు గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఇందులో కోహ్లి మూడుసార్లు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గోల్డెన్‌ డక్‌ అవడం ద్వారా చెత్త రికార్డును నమోదు చేశాడు

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా తొలి టెస్టులో విజయానికి ఇంకా 157 పరుగుల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 12, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ రూట్‌ సెంచరీతో(109 పరుగులు) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్‌, ఠాకూర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు