ఫ్రెంచ్‌ ఓపెన్‌కు మాజీ విజేత వావ్రింకా దూరం 

19 May, 2021 09:31 IST|Sakshi

పారిస్‌లో ఈనెల 30న మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తాను ఆడటంలేదని 2015 చాంపియన్, ప్రపంచ 24వ ర్యాంకర్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) మంగళవారం ప్రకటించాడు. గత మార్చిలో వావ్రింకా ఎడమ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించపోవడంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నానని... జూన్‌ 28న మొదలయ్యే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీతో పునరాగమనం చేస్తానని 36 ఏళ్ల వావ్రింకా తెలిపాడు.
 

మరిన్ని వార్తలు