శతక్కొట్టిన టర్నర్‌.. 17వ సారి షెఫీల్డ్‌ షీల్డ్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా

26 Mar, 2023 12:44 IST|Sakshi

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా.. షెఫీల్డ్‌ షీల్డ్‌ 2022-23 టైటిల్‌ను 17వ సారి సొంతం చేసుకుంది. విక్టోరియాతో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట నాలుగో రోజైన ఇవాళ (మార్చి 26) విక్టోరియా నిర్ధేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా వికెట్‌ కోల్పోయి ఛేదించింది. కెమారూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ (39), టీగ్‌ వైల్లీ (43) వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు సాధించి 120 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ను దక్కించుకుంది. విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో ఆష్లే చంద్రసింఘే (46) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆస్టన్‌ టర్నర్‌ (128) సెంచరీతో కదం తొక్కాడు.

అనంతరం​ విక్టోరియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 210 పరుగులకే చాపచుట్టేసి, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌ జోష్‌ ఫిలిప్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురిని, రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరిని ఔట్‌ చేయడంలో భాగం కావడం విశేషం. 

మరిన్ని వార్తలు