ప్రగతిలో ముందున్నాం

12 Nov, 2023 00:44 IST|Sakshi

స్థానిక ఎమ్మెల్యేలు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నారు. ఆయా పనులకు ప్రాధాన్యం ఇచ్చి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనుల పురోగతిలో ముందంజలో ఉన్నాం.

– ఎం.హరినారాయణన్‌, కలెక్టర్‌

ప్రతి ఇంటికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను చేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి

ఆదరణ లభించింది. ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లి గత నాలుగున్నరేళ్లలో ప్రతి కుటుంబం పొందిన సంక్షేమ లబ్ధిని వివరిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వేగవంతంలో జిల్లా ముందంజలో ఉంది.

రోడ్లు, డ్రెయిన్ల మంజూరు

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా మా పంచాయతీకి సీసీ రోడ్లు, డ్రెయిన్లు మంజూరు చేశారు. విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించగలిగారు. మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించారు. రోడ్ల పనులను ప్రారంభించి పూర్తి చేశారు.

– వై.పెంచలరెడ్డి, పులికల్లు గ్రామం, పొదలకూరు మండలం

ప్రజాప్రతినిధులు,

సమన్వయకర్తలకు అపూర్వ స్పందన

గుర్తించిన సమస్యలకు పరిష్కారం

శరవేగంగా అభివృద్ధి పనులు

సర్వేపల్లి, కోవూరులలో పూర్తయిన కార్యక్రమం

జిల్లాలో..

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తయిన సచివాలయాల పరిధిలో పనుల మంజూరు కోసం అధికారులతో సమీక్షలు నిర్వహించి అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

సచివాలయాలు – 769

‘గడప గడపకు..’ పూర్తయింది – 640

(సచివాలయాల పరిధిలో..)

గుర్తించిన అభివృద్ధి పనులు – 3,496

ఆమోదం పొందినవి – 3,308

నిర్ణీత గడువులోపు పూర్తయినవి – 2,084

పురోగతిలో ఉన్న పనులు – 865

కేటాయించిన నిధులు – రూ.116.65 కోట్లు

పూర్తయిన పనులకు

చెల్లించింది – రూ.61.74 కోట్లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చడంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న లబ్ధిని వారికి తెలియజేయడంతోపాటు స్థానిక సమస్యలను గుర్తించి వీలైనంత త్వరగా పరిష్కరించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రారంభించారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే నిధులు కేటాయించి ఆయా పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఒక ప్రాంతంలో పూర్తయిన పిదప సమీక్ష నిర్వహించి ఆ ప్రాంతంలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను సచివాలయ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అనంతరం నమోదైన పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పనుల ప్రాధాన్యతను బట్టి అంచనాలు సిద్ధం చేసి జిల్లా అధికార యంత్రాంగానికి పంపుతున్నారు. వెనువెంటనే అధికారులు సైతం ఆయా పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు ఇస్తుండడంతో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.

అదనపు నిధులు మంజూరు

ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సంబంధించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి అదనపు నిధులు మంజూరు చేశారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో రూ.20 లక్షల మేరకు అభివృద్ధి పనులకు కేటాయించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తమ నియోజకవర్గాల పరిధిలో సచివాలయాలకు ఇచ్చే రూ.20 లక్షలతోపాటు మరో రూ.20 లక్షల కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించగా ఆయన ఓకే చెప్పడంతో ఆయా నియోజకవర్గాలకు అదనపు నిధులు కేటాయించారు. తద్వారా ఆయా నియోజకవర్గాలో అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి.

ఈబీసీ నేస్తం అందింది

గతేడాది మాకు మంజూరు కావాల్సిన ‘ఈబీసీ నేస్తం’ సాంకేతిక కారణాల వల్ల ఆగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సందర్భంగా మా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి ఈ సమస్యను విన్నవించుకున్నాం. రోజుల వ్యవధిలోనే మా సమస్యను పరిష్కరించి ఈబీసీ నేస్తం మంజూరు చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

– దొడ్ల సుశీలమ్మ, నువ్వూరుపాడు,

ఆత్మకూరు మండలం

సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో సక్సెస్‌

జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు పూర్తి చేశారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలో దాదాపుగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 1,01,205 గడపలకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 89 గ్రామ సచివాలయాల పరిధిలో 195 రోజులపాటు పర్యటించి 96 వేల గడపలకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు