ప్రజలు సిరిసంపదలతో వర్ధిల్లాలి

12 Nov, 2023 00:44 IST|Sakshi

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(దర్గామిట్ట): దీపావళి పండగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రాన్ని విజయవంతంగా పాలించే శక్తియుక్తులు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

పర్యావరణహితంగా

దీపావళిని జరువుకోవాలి

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు(దర్గామిట్ట): దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితంలో చీకట్లు తొలగించి వెలుగులు నింపాలని, అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా శనివారం ఆయన జిల్లా ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పర్యావరణహితంగా దీపావళి పండగను జరువుకోవాలని ఆయన సూచించారు.

జీవితాల్లో వెలుగులు

నింపే పండగ

కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(దర్గామిట్ట): ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండగ దీపావళి అని, ఈ పర్వదినం విజయానికి ప్రతీక అని, అందరి జీవితాల్లో ఈ దీపావళి సరికొత్త వెలుగులు నింపాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ జిల్లా ప్రజలకు శనివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి రోజు బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, కూడళ్లలో బాణసంచా కాల్చరాదని తెలిపారు.

రేపటి స్పందన రద్దు

నెల్లూరు(క్రైమ్‌): దీపావళి పండగ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరగనున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.

జగనన్న మళ్లీ సీఎం కావాలని..

మోకాళ్లపై తిరుమల

కొండ ఎక్కిన యువకులు

విడవలూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మళ్లీ కోవూరు ఎమ్మెల్యేగా గెలుపొందాలని విడవలూరుకు చెందిన ఇద్దరు యువకులు తిరుపతి నుంచి తిరుమలకు మోకాళ్లపై మెట్లు ఎక్కారు. విడవలూరుకు చెందిన డక్కా హరీంద్ర, నక్కా దినేష్‌ అనే ఇద్దరు యువకులు శనివారం వైఎస్సార్‌సీపీ జెండా చేతబట్టి తిరుమల నడక దారిన మోకాళ్లపై మెట్లు ఎక్కామని తెలిపారు.

మరిన్ని వార్తలు