సీఎంని పరామర్శించిన ఎంకే స్టాలిన్‌

20 Oct, 2020 07:54 IST|Sakshi
తవసాయమ్మకు నివాళులర్పిస్తున్న స్టాలిన్‌ తదితరులు, పక్కన సీఎం పళనిస్వామి 

సాక్షి, చెన్నై : సేలం నుంచి సోమవారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం పళనిస్వామిని పలువురు నేతలు పరామర్శించారు. సీఎం పళనిస్వామి తల్లి తవసాయమ్మ గత వారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా సీఎం సేలంలోనే ఉన్నారు. సోమవారం చెన్నై వచ్చిన సీఎంను పరామర్శించేందుకు నేతలు గ్రీన్‌ వేస్‌ రోడ్డుకు ఉదయాన్నే చేరుకున్నారు. తవసాయ మ్మ చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్‌ నేత పొన్ముడి తదితరులు పళనిస్వామికి సానుభూతి తెలియజేశారు. గతంలో అన్నాడీఎంకేకు చెందిన ముఖ్యులు ఎవరైనా మరణించినా డీఎంకే వారు వెళ్లే వారు కాదు. అన్నాడీఎంకే వారి పరిస్థితి కూడా అంతే. జయలలిత, కరుణానిధి మరణంతో రెండు పారీ్టల నేతలు పరామర్శించుకోవడం మొదలుపెట్టారు.  (జయలలిత మరణంపై అనుమానాలు: స్టాలిన్‌)

ప్రస్తుతం సీఎం పళనిస్వామిని పరామర్శించి స్టాలిన్‌ తన రాజకీయ నాగరికతను చాటుకున్నారు. ముందుగా మంత్రులు జయకుమార్, కడంబూరు రాజు, కామరాజ్, కేసి వీరమణి, విజయ భాస్కర్, కేటి రాజేంద్ర బాలాజీ తదితరులు సీఎంను పరామర్శించారు. సాయంత్రం గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్, సినీ నటుడు విజయ్‌ సేతుపతి  సీఎంను పరామర్శించారు. సానుభూతి తెలియజేశారు.

మరిన్ని వార్తలు