నీట్‌పై న్యాయ పోరాటం కొనసాగిస్తాం

15 Mar, 2023 00:52 IST|Sakshi
అనిత పేరుతో రూపుదిద్దుకున్న ఆడిటోరియం, పరిశీలిస్తున్న మంత్రులు

సాక్షి, చైన్నె : నీట్‌ రద్దే లక్ష్యంగా న్యాయ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ స్పష్టం చేశారు. నీట్‌కు వ్యతిరేకంగా బలన్మరణానికి పాల్పడి అనిత పేరిట ఓ ఆడిటోరియంను రూపొందించారు. వివరాలు.. అరియలూరు ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 22 కోట్లతో భవనాలను , అత్యాధునిక సేవలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌, విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌, రవాణా మంత్రి శివశంకర్‌తో కలిసి ఈ ఆసుపత్రి భవనాలను ఉదయ నిధి స్టాలిన్‌ ప్రారంభించారు. అలాగే, నీట్‌కు వ్యతిరేకంగా తొలి న్యాయ పోరాటం చేసి, చివరకు బలన్మరణానికి పాల్పడిన అరియలూరు విద్యార్థిని అనిత పేరిట ఇదే ఆసుపత్రి ఆవరణలో ఆడిటోరియం నిర్మించారు. దీనిని ఉదయ నిధి స్టాలిన్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నీట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నీట్‌ రద్దు నినాదం రాష్ట్రంలో మారుమోగాలనే కాంక్షతోనే బలన్మరణానికి పాల్పడిన అనిత పేరును ఈ ఆడిటోరియానికి పెట్లాలని సీఎం స్టాలిన్‌ ఆదేశించారని తెలిపారు. అలాగే, సోమవారం ప్లస్‌–2 పరీక్ష అనేకమంది విద్యార్థులు రాయ లేకపోయినట్లు సమాచారం వచ్చిందని, వారికి మళ్లీ అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

ఉదయ నిధి స్టాలిన్‌

ఆడిటోరియానికి అనిత పేరు

మరిన్ని వార్తలు