జాక్టో జియో ఆధ్వర్వంలో మానవహారం రేపు

23 Mar, 2023 02:16 IST|Sakshi
సమావేశంలో ప్రసంగిస్తున్న జాక్టో జియో ప్రతినిధి జనార్ధనన్‌

వేలూరు: వేలూరు జిల్లా జాక్టో జియో ప్రతినిధుల ఉన్నత స్థాయి సమావేశం కాట్పాడిలో జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులు జనార్ధనన్‌ మాట్లాడుతూ జాక్టో జియో ఆధ్వర్యంలో కొత్త పెన్షన్‌ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని కోరుతూ నెలల తరబడి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా ఆహ్యానించ పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24న వేలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలూరు, కాట్పాడి, కేవీ కుప్పం, గుడియాత్తం, పేర్నంబట్టు వంటి తాలుకా కార్యాలయాల ఎదుట జాక్టో జియో ప్రతినిధులచే మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నట్లు తీర్మానం చేశారు. సమావేశంలో తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి దీన దయాళన్‌, తమిళనాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు ఇలంగో, జిల్లా కోశాధికారి మణి, రాష్ట్ర జనరల్‌ కమిటీ సభ్యులు విల్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు