జగన్మోహిని స్ఫూర్తితో రిప్పబ్బరి

10 Apr, 2023 02:22 IST|Sakshi
రిప్పబ్బరి చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణలో యూనిట్‌ సభ్యులు

తమిళసినిమా: మాస్టర్‌ మహేంద్రన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం రిప్పబ్బరి. నటి కావ్య అరివుమణి, ఆర్తి, శ్రీని, నోబిల్‌ జేమ్స్‌, మారి తదితరులు పోషించారు. ఏకే ది టేల్స్‌ మెన్‌ పతాకంపై ఎన్‌.అరుణ్‌ కార్తీక్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. దళపతి రత్నం ఛాయాగ్రహణం, ద్వారకా త్యాగరాజన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 14న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని పలోజో థియేటర్లో చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత అరుణ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ఇది హార్రర్‌, కామెడీ నేపథ్యంలో రూపొందించిన చిత్రమని తెలిపారు. జగన్మోహిని స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రం రిప్పబ్బరి అని చెప్పారు. చిత్రాన్ని తొలిసారిగా తానే దర్శకత్వం వహించి నిర్మించడంతో కాస్త భయం వేసిందన్నారు. అయితే సొంతంగా చిత్రం చేయడానికి మంచి కథ అవసరమన్నారు. అలా ఈ కథ తనకు పక్కబలంగా అమరిందన్నారు. మంచి కథ లభించిన నమ్మదగ్గ నటీనటులు, సాంకేతిక వర్గం అవసరమన్నారు. ఆ విధంగా ఈ చిత్రంలో పని చేసిన వారంతా తమిళ సినిమాలో ఉన్నత స్థానానికి చేరుకోదగ్గ ప్రతిభ కలిగిన వారని పేర్కొన్నారు. వారి వల్లే తనకు ఈ చిత్రం సాధ్యమైందని చెప్పారు. దివాకర్‌ త్యాగరాజన్‌ సంగీతం, దళపతి రత్నం ఛాయాగ్రహణం, మురుగన్‌ వేల్‌, ఎడిటింగ్‌ ఈ చిత్రాన్ని వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయన్నారు. ఇక నటుడు మాస్టర్‌ మహేంద్రన్‌ ఈ చిత్రం ద్వారా తనకు ఒక సహోదరుడుగా లభించారన్నారు. తన పనిని సగం ఆయనే చేశారని కొనియాడారు.

మరిన్ని వార్తలు