సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

27 Apr, 2023 06:36 IST|Sakshi

కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. వివరాలు.. చైన్నె సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పోలీసు కంట్రోల్‌ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించాడు. కాసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కట్‌ చేశాడు. దీంతో సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఫ్లవర్‌బజార్‌ అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ విశ్వనాథన్‌ భాగ్యరాజ్‌ నేతృత్వంలో పోలీసులు విచారించారు.

ఫోన్‌ కాల్‌ నంబర్‌ కీల్పాక్కం మెంటల్‌ హెల్త్‌ షెల్టర్‌ నుంచి వచ్చినట్లు తెలిసింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యాసార్పాడికి చెందిన రామలింగం కుమారుడు మణికంఠన్‌ (21)గా గుర్తించారు. అతను ఏడేళ్లుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే తన వద్ద బాంబు ఉందని రెండుసార్లు ఎగ్మూర్‌ రైల్వే స్టేషన్‌ను బెదిరించాడు. స్టేషన్‌లో బాంబు లేదని నిర్ధారించిన పోలీసులు మరోసారి ఇలాంటివి పునావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు