ప్రేమ పేరుతో వంచన.. రహస్య వీడియోలు బయటపెడతానని..!

3 Sep, 2023 14:11 IST|Sakshi

తిరుత్తణి: ప్రేమ పేరిట యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుత్తణి యూనియన్‌ ఎస్‌.అగ్రహారం గ్రామానికి చెందిన యువతి (24) చైన్నెలో ప్రయివేటు కళాశాలలో చదువుతోంది. రోజూ తిరుత్తణి నుంచి ట్రైనులో కళాశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుడిగుంట గ్రామానికి చెందిన ఇళంగో(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను అనుభవించాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు తీశాడు. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా కుదరదని, ఎవరికై నా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె యువకుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. వారు కూడా ఆమెను బెదిరించి పంపి వెంటనే యువకుడికి వేరొక అమ్మాయితో వివాహం చేశారు.

మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుత్తణి ఎస్‌ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి ఇళంగోను అరెస్టు చేశారు. పైగా యువతిని బెదిరించి ఆత్మహత్యకు ప్రేరేపించి పరారిలో వున్న ఇళంగో తండ్రి నాగరత్నం, అతని పెదనాన్న చక్రపాణి, కృష్ణమూర్తి, చిన్నాన్న సంజీవులు కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు