విజయవంతంగా గుండెమార్పిడి

10 Oct, 2023 07:56 IST|Sakshi
గుండె మార్పిడి చేసిన వ్యక్తితో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న వైద్యులు

 సాక్షి, చైన్నె: చైన్నెకు చెందిన 22 ఏళ్ల యువకుడికి తిరుచ్చికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి గుండెను అవయవ మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా అమర్చారు. విజయవంతం కావడంతో ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. సోమవారం చైన్నె గ్లెనెగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ గోవిని బాల సుబ్రమణియన్‌ వివరాలను మీడియాకు వివరించారు. చైన్నెకు చెందిన యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైంది.

తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ద్వారా అతడిని చికిత్స నిమిత్తం మే నెలలో గ్లెనెగల్స్‌కు తరలించారు. ఆర్గాన్‌ రిజిస్టర్డ్‌ జాబితా మేరకు తిరుచ్చిలో బ్రెయిన్‌ డెడ్‌కు గురైన 30 ఏళ్ల వ్యక్తి గుండెను ఈ యువకుడికి దానం చేశారు. గత నెల 13వ తేదీ ఐదు గంటల పాటుగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. తనకు పునర్జన్మ దక్కడంతో వైద్యులతో కలిసి కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు.

మరిన్ని వార్తలు