మహిళల ఖాతాల్లో నేడు రూ.1000 జమ

10 Nov, 2023 05:30 IST|Sakshi
● పండుగ సందర్భంగా ముందస్తు లబ్ధి

సాక్షి, చైన్నె: మగళిర్‌ ఉరిమై తిట్టం( కలైంజ్ఞర్‌ మహిళా హక్కు పథకం) లబ్ధిదారులందరికీ ముందుగానే బ్యాంక్‌ ఖాతాల్లో శుక్రవారం నగదు జమ చేయనున్నారు. దీపావళిని పురస్కరించుకుని ముందస్తుగా రూ. 1000 పంపిణీ ఏర్పాట్లు చేశారు. వివరాలు.. ఎన్నికల వాగ్దానంగా మహిళలకు నెలకు రూ. 1000 బ్యాంక్‌ ఖాతాలలో జమ చేస్తామని సీఎం స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని కార్యరూపంలో తెచ్చే విధంగా దివంగత సీఎం అన్నాదురై జయంతి వేళ ఆయన పుట్టిన గడ్డలో సెప్టెంబరు 15వ తేదీన శ్రీకారం చుట్టారు. కలైంజ్ఞర్‌ మగళిర్‌ ఉరిమి తిట్టం( కలైంజ్ఞర్‌ మహిళా హక్కు) పథకంగా దీనిని అమల్లోకి తెచ్చారు. కాంచీపురం వేదికగా కోటి ఆరు లక్షల మందికి ఈ పథకం వర్తింప చేస్తూ చర్యలు తీసుకున్నారు. అయితే తమ కంటే తమకు నగదు రాలేదని పెద్దఎత్తున మహిళలు ఆందోళన బాట పట్టారు. ఇలాంటి వారి దరఖాస్తులలో ఏదేని పొరబాట్లు జరిగి ఉన్నా, ఇతర కారణాలు ఉన్నా. .వాటిని పరిశీలించుకుని అప్పీల్‌ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం 30 రోజులు గడువు కేటాయించారు. ఇందులో 11. 87 లక్షల మంది అప్పీలు చేసుకున్నారు. సమగ్ర పరిశీలన మేరకు ఇందులో 7 లక్షల మందిని ఎంపిక చేశారు. వీరితో పాటు అందరికీ ప్రతినెలా 15వ తేదీ కాకుండా పండుగ దృష్ట్యా ఈసారి మాత్రం 10వ తేదీన బ్యాంక్‌ ఖాతాలలో జమ చేయడానికి చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు