ఉచితంగా కంటి పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఉచితంగా కంటి పరీక్షలు

Published Mon, Nov 20 2023 12:40 AM

- - Sakshi

కంటి చూపు సక్రమంగా లేక తీవ్ర ఇబ్బంది పడుతుండేదాన్ని. ఆస్పత్రికి పోదామంటే పని ఒత్తిడి వల్ల ఎవరూ నాకు తోడు రాలేకపోయారు. అలాగే కాలం నెట్టుకొచ్చా. మా ఊళ్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టిన తర్వాత వెళ్లి చూపించుకున్నా. వైద్యాధికారులే సొంతంగా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు చూపు బాగుంది. జగన్‌ బాబు మేలు మరువలేను.

– దాసరి చంద్రమ్మ, కమ్మూరు,

కూడేరు మండలం

ఇంట్లో అందరికీ ఉచిత వైద్యం

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మాలాంటి నిరుపేదలకు నిజంగా ఓ వరం. ఇలాంటి వైద్య సేవలు గతంలో నేనెన్నడూ చూడలేదు. నిపుణులైన వైద్యులే మా ఊరికి వచ్చి నాతో పాటు మాఇంట్లోని అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, నాణ్యమైన మందులూ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలు చాలా బాగున్నాయి. ఆయనే మళ్లీ సీఎం కావాలి.

– ఉమాపతి, చీకలగురికి, విడపనకల్లు

త్వరలో సొంతింట్లోకి

ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు కావాలని అధికారులను, నాయకులను అభ్యర్థించాను. ఆఫీసుల చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చాను. అయినా నాకు సొంతిల్లు రాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత వలంటీర్‌ మేముంటున్న అద్దె ఇంటి వద్దకే వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లారు. రోజుల వ్యవధిలోనే ఇంటి పట్టా వచ్చింది. నేనైతే ఏ ఆఫీసూ మెట్టు ఎక్కలేదు. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతోంది. త్వరంలో సొంతింట్లోకి చేరుకుంటాం. నా కలను నెరవేర్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.

– సారెడ్డి లక్ష్మీదేవి, గంగాదేవిపల్లి,

తాడిపత్రి మండలం

నా కల సాకారమైంది

నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయంపైనే ఆధారపడ్డాను. వర్షాభావం కారణంగా పంట సాగు భారమయ్యేది. దీంతో పొలంలో బోరు వేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. దీంతో బోరుపై ఆశ వదులుకున్నా. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మా రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. అందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా నేను పరితపిస్తున్న బోరుబావిని వైఎస్సార్‌ జలకళ పథకం కింద నా పొలంలో ఉచితంగా వేయించారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇప్పించారు. ఇప్పుడు నా పొలంలో మామిడి మొక్కలు నాటాను. అంతర పంటగా కంది సాగు చేపట్టాను. మా బతుకులు మార్చిన వైఎస్‌ జగన్‌ కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా.

– పవన్‌ ఆంజనేయులు, కసాపురం,

గుంతకల్లు మండలం

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement