తగ్గిన నెట్‌ స్పీడ్‌; జియోనే నంబర్‌వన్

17 Nov, 2020 11:27 IST|Sakshi

రిలయన్స్ జియో డౌన్‌‌లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 1.5 ఎంబీపీఎస్ పడిపోయింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. అక్టోబర్ లో జియో డౌన్‌లోడ్ స్పీడ్ వచ్చేసి 17.8 ఎంబీపీఎస్‌గా ఉంది. రెండవ స్థానంలో కొనసాగుతున్న ఐడియా కంటే జియో స్పీడ్ వచ్చేసి 95% శాతం ఎక్కువ. అక్టోబర్ లో ఐడియా డౌన్‌లోడ్ స్పీడ్ వచ్చేసి 9.1 ఎంబీపీఎస్‌గా ఉంది. అప్ లోడ్ స్పీడ్ విషయంలో కూడా జియో ఇంకా వెనుక బడే ఉంది. గత ఏడాది కలిసిపోయిన  వొడాఫోన్, ఐడియాలను ట్రాయ్ ఇంకా ప్రత్యేక టెల్కోలుగానే పరిగణిస్తోంది. సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్‌లోడ్ స్పీడ్, అక్టోబర్‌లో 17.8 ఎంబీపీఎస్‌కు పడిపోయింది. ఇప్పటికీ ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ విషయం‌లో జియోనే నంబర్ వన్. ఇక ఐడియా విషయానికి వస్తే.. జియో తర్వాత రెండో స్థానంలో 9.1 ఎంబీపీఎస్‌తో ఉంది. సెప్టెంబర్‌లో ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ 8.6 ఎంబీపీఎస్‌గా ఉండగా, 0.5 ఎంబీపీఎస్ మెరుగు పరుచుకుంది. 

ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం మూడో స్థానంలో వొడాఫోన్ ఉంది. వొడాఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ 8.8 ఎంబీపీఎస్‌గా ఉంది. సెప్టెంబర్‌లో వొడాఫోన్ 7.9 ఎంబీపీఎస్‌గా ఉండేది. అయితే ఇది కూడా 0.9 ఎంబీపీఎస్ వరకు పెరిగింది. ఇక 7.5 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఎయిర్ టెల్ నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ రెండు నెలల నుంచి అలాగే ఉంది. అందులో ఎటువంటి మార్పూ లేదు.

Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు