జియో వినియోగదారులకు శుభవార్త

7 Nov, 2023 21:57 IST|Sakshi

వినియోగదారులకు రిలయన్స్‌ శుభవార్త చెప్పింది. వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో మెరుగైన వెర్షన్‌లో 4జీ ఫోన్‌లను రూ.999కే అందించనుంది.   

ఈ నేపథ్యంలో నోకియా, లావా, ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్లతో కలిసి స్మార్ట్‌ఫోన్‌ సొంత వెర్షన్లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుందని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్  తెలిపారు. 250 మిలియన్ల 2జీ వినియోగదారులు 4జీ టెక్నాలజీని వినియోగించేలా కృషి చేయాలని కంపెనీ భావిస్తుందన్న ఆయన .. 450కి పైగా ఛానళ్లతో లైవ్ టీవీ, లేటెస్ట్ సినిమాలు, పాటలు, ఐపీఎల్ స్ట్రీమింగ్, ఇతర కంటెంట్ వంటి ఫీచర్లను రిలయన్స్ జియో 30 శాతం తక్కువ ధరకే అందిస్తోంది. స్కాన్ అండ్ పే ఆప్షన్ తో యూపీఐ పేమెంట్స్ ను జియో ప్రవేశపెట్టిందని దత్ వెల్లడించారు. 

గత నెలలో రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్ జియోభారత్ బి1ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ధర రూ.1,299గా ఉంది. ఈ ఫోన్‌లో 2.4 అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్ అందించేందుకు జియో యాప్స్‌ను ఫ్రీ ఇన్ స్టాల్ చేసింది. 23 భారతీయ భాషలను సపోర్ట్‌ చేస్తుండగా.. యూపీ పేమెంట్స్‌ కోసం జియోపేని ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు జియో కల్పిస్తుంది.  జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వీ2, కే1 కార్బన్ వంటి ఫోన్లను జియో ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు