అందుకే ఖమ్మం వచ్చా: యాంకర్‌ ప్రదీప్‌

8 Feb, 2021 11:05 IST|Sakshi
మాట్లాడుతున్న హీరో ప్రదీప్‌

సాక్షి, ఖమ్మం: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా యూనిట్‌ ఆదివారం సాయంత్రం ఖమ్మంలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శించబడుతున్న తిరుమల థియేటర్‌కు యాంకర్‌ ప్రదీప్‌ రాగా.. అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులతో ముచ్చటించి, సినిమా ఎలా ఉందో తెలుసుకున్నారు. తనను ఆదరిస్తున్న వారందరికీ ప్రదీప్‌ కృతజ్ఞతలు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని హిట్‌ చేసిన ప్రేక్షకులను స్వయంగా కలుసుకునేందుకే తమ యూనిట్‌ ఖమ్మంకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు మున్నా, నిర్మాత శ్రీనివాసరావు, థియేటర్‌ మేనేజర్‌ సంగబత్తుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: 
ఇస్మార్ట్‌ సోహైల్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌

గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు