31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు

24 Sep, 2022 03:02 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు  ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు కేసులున్నందున తుదితీర్పునకు లోబడి ఈ పదోన్నతులుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందినవారిలో ఆర్‌.డి.మాధురి, బి.రోహిత్‌సింగ్, ఎ.పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్, మహ్మద్‌ అసదుల్లా, కె.వి.వి.రవికుమార్, డి.రాజ్యలక్ష్మి, కనకం స్వర్ణలత, జి.వెంకటేశ్వర్లు, వి.భుజంగరావు, డి.వెంకటమాధవరావు, ఎం.వెంకటభూపాల్‌రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్‌.తిరుపతిరావు, చీమలపాటి మహేందర్‌జీ, కె.గంగాధర్, బి.కిషన్‌రావు,

ఎస్‌.సూరజ్‌కుమార్, ఇ.వెంకటాచారి, వి.విక్టర్, ఎల్‌.కిశోర్‌కు మార్, పి.అశోక్‌కుమార్, ఎం.విజయలక్ష్మి, జె.శ్రీనివాస్, డి.విజేందర్‌రెడ్డి, కె.శ్యామలాదేవి, కె.వీరబ్రహ్మచారి, జె.ఎల్‌.బి.హరిప్రియ, కె.లక్ష్మి కిరణ్, డి.వేణు, టి.ఎల్‌.సంగీత ఉన్నారు. కాగా, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తహసీల్దార్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, సీఎస్‌ సోమేశ్‌ కు కృతజ్ఞతలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు