చిన్నారి ఆరోగ్యానికి కేటీఆర్‌ భరోసా

18 May, 2021 08:01 IST|Sakshi
తల్లిదండ్రులతో చిన్నారి కరిష్మా 

ట్విట్టర్‌లో స్పందించిన మంత్రి

సాక్షి, ఆదిలాబాద్‌: అపత్కాలంలో ముందుండి సా యం చేస్తున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శా ఖ మంత్రి కేటీఆర్‌ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని హత్తిగుట్ట గిరిజన గ్రామానికి చెందిన టేకం భీంరావు, సంగీతాబాయి దంపతుల కుమార్తే కరిష్మా (2) ఆరోగ్యానికి భరోసా కల్పించారు. చిన్నారికి పుట్టుక నుంచి కాళ్లు, చేతులు పని చేయడం లేదు. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. పాప తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

వైద్యం చేయించే స్థోమత లేక పాపను ఇంటి వద్దనే ఉంచి పనులకు వెళ్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన నిర్ణయ్‌ ఫర్‌ ఆదిలాబాద్‌ స్వచ్ఛంద సంస్థ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో చిన్నారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ కేటీఆర్‌ ఆది వారం ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన హోమియోపతి డాక్టర్‌ సుభాష్‌ చందర్‌ కూడా చిన్నారికి చికిత్స, అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు పాప తండ్రి భీంరావు తెలిపారు.  

చదవండి: దారుణం: తిట్టాడని సిమెంట్‌ ఇటుకతో తలపై బాది..  

మరిన్ని వార్తలు