ఆలూరి లలిత కన్నుమూత 

22 Nov, 2021 04:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విప్లవరచయితల సంఘం సభ్యురాలు, ఆలూరి భుజంగరావు సహచరి ఆలూరి లలిత (76) ఆదివారం కన్నుమూశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో కుమారుడి దగ్గర ఉంటున్న ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కుమార్తె ఆలూరి కవిని తెలిపారు. సోమవారం గుల్బర్గాలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలూరి భుజంగరావు మరణం తరువాత లలిత మూడేళ్లపాటు గుంటూరులోనే ఉన్నారు.

అనారోగ్యం కారణంగా గుల్బర్గాలో ఉంటున్న కుమారుడు శివప్రసాద్‌రావు దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. గత 40 ఏళ్లు ప్రజా సంఘాలతో కలిసి పని చేశారు. భుజంగరావుతో కలిసి దశాబ్దానికి పైగా అజ్ఞాత జీవితం గడిపారు. భుజంగరావు రచనావ్యాసంగంలో భాగస్వామిగా నిలిచారు. ఆమె చాలాకాలంగా విరసం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఆలూరి లలిత మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పలువురు సంతాపం తెలిపారు.   

మరిన్ని వార్తలు