కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

9 Aug, 2021 10:43 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచమర్రి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలానికి చెందిన అల్లెపు రాము అనే వ్యక్తి కామారెడ్డి వైపు వెళ్తుండగా మహిళ లిఫ్ట్‌ అడగటంతో ఆమెను కూడా బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైకుపై ఉన్న ఇద్దరూ పల్టీ కొట్టి ముందుకు పడ్డారు.​ కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

రామంతపూర్‌లో రోడ్డు ప్రమాదం.. బీటెక్‌ విద్యార్థి మృతి
హైదరాబాద్: ఉప్పల్ పీఎస్‌ పరిధిలోని రామంతపూర్ డీమార్ట్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా అతివేగంతో వస్తున్న డ్యుక్ బైక్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి సర్వ రేవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు రేవంత్ రామంతాపూర్ ఆనంద్ నగర్ నివాసిగా గుర్తించారు. మృతుడు బైక్ నడుపుతూ డివైడర్ ను ఢీకొన్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు